- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బిసి జనగణన ప్రవేశపెట్టడానికి స్వాగతిస్తున్నామని ఎంఎల్‌సి కవిత తెలిపారు. శనివారం ఆమె శాసన మండలిలో మాట్లాడారు. కులగణన పేరిట కాంగ్రెస్ ప్రజలను మభ్య పెడుతోందని దుయ్యబట్టారు. ఎన్నికలయ్యక కంటి తుడుపు లాగా తీర్మానం చేసిందని, రెండు అసెంబ్లీ సమావేశాలు అయ్యాక కూడా బిసిల అంశానికి అతీగతీ లేదని, కులగణన తీర్మానంలో స్పష్టత లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం తీరును భారత జాగృతి ఖండిస్తుందని దుయ్యబట్టారు. కుల గణనపై చట్టం చేయాలని, వెంటనే కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. బిసిలకు ఈ బడ్జెట్‌లో 20 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బిసిలు ఇప్పుడు గుర్తుకు వచ్చారా? అని కవిత ప్రశ్నించారు.
- Advertisement -