Monday, December 23, 2024

నేను ఏ తప్పు చేయలేదు.. ఇడి విచారణకు వెళ్తా: కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఇడి నోటీసులపై ఎంఎల్‌సి కవిత న్యాయ పోరాటం చేస్తున్నారు. ఇడి నోటీసులపై స్టే ఇవ్వాలని సుప్రీం కోర్టును కవిత కోరారు. విచారణ పేరిట ఇడి ఆపీసుకు పిలవడంపై కవిత పిటిషన్ వేశారు. మధ్యంతర రిలీఫ్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ నెల 24న విచారణ చేస్తామని సుప్రీం పేర్కొంది.

బుధవారం ఇడి విచారణకు ఎంఎల్‌సి కవిత హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విఫలమైందని ఎంఎల్‌సి కవిత విమర్శించారు. మహిళా రిజర్వేషన్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తామని, అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేస్తున్నామని, ఇప్పటికే పలు పార్టీలు ఇవాళ్టి రౌండ్ టేబుల్ సమావేశానికి మద్దతు ఇచ్చాయి. తాను ఏ తప్పు చేయలేదని, ఇడి విచారణకు వెళ్తానని కవిత స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News