Saturday, January 18, 2025

కెసిఆర్ చేసిన కృషి ఫలించింది:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

బీడుబడ్డ తెలంగాణ భూములకు కృష్ణా జలాలను మళ్లించాలని ఉద్యమ నేత కెసిఆర్ చేసిన కృషి ఫలించిందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కృష్ణా జలాల్లో వాటాపై ట్రిబ్యునల్ ఉత్తర్వులపై ఎంఎల్‌సి కవిత ఎక్స్ వేదికగా స్పందించారు. కృష్ణా నీళ్లలో మా వాటా మాకే అని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ చేసిన పోరాట ఫలాలు అందుకోవడం ఎంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాల వారీగా నీటి కేటాయింపులపై విచారణ జరపాలని గత పదేళ్లుగా కెసిఆర్ చేసిన వాదనకే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ మొగ్గు చూపడం సంతోషకరమని అన్నారు. ఇది బిఆర్‌ఎస్ పార్టీ విజయం…తెలంగాణ ప్రజల విజయం అంటూ ట్వీట్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News