Thursday, January 23, 2025

తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం: కవిత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: తెలంగాణ ప్రజలతో బిఆర్‌ఎస్‌కు పేగుబంధం ఉందని ఎంఎల్‌సి కవిత తెలిపారు. ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లిలో ఎంఎల్‌సి కవిత రోడ్‌షో చేపట్టారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగించారు. కాంగ్రెస్‌ది అధికారం కోసం అహంకారంగా ఉందని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ చెప్పినవన్నీ చేసి చూపించారని, పచ్చబడ్డ తెలంగాణను ఆగం కావొద్దని ఎంఎల్‌సి కవిత తెలియజేశారు. కొత్త రేషన్ కార్డు ఇచ్చిన తరువాత ప్రభుత్వ పథకాలు అందిన ఆడ బిడ్డలకు నెలకు మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు. పదేళ్ల చెప్పిన వన్నీ చేసి చూపించామని, ఇవాళ చెప్పినవన్నీ కూడా చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రంలో మోడీ ప్రధాని వచ్చినప్పటి నుంచి ఉప్పు, పప్పు, నూనె, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News