Wednesday, January 22, 2025

మోడీకి, కెసిఆర్‌కు గొడవ అప్పట్నుంచే: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: కేంద్ర ప్రభుత్వంపై బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి విరుచుకుపడ్డారు. పదేళ్ల నుండి సిలిండర్ ధర విషయంలో ప్రధాని నరేంద్ర మోడీకి, సిఎం కెసిఆర్‌కు గొడవ జరుగుతుందని కవిత తెలిపారు. అమిత్ షా కాదు.. అబద్దాల బాద్‌షా అన్నారు. ఎయిర్ ఇండియాతో పాటు దేశంలో ఉన్న ప్రభుత్వ సంస్థలను అమ్మేసినవాళ్లు ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీలు తెరిపిస్తారట అని ఎద్దేవా చేశారు. ఇక్కడ ఉన్న షుగర్ ఫ్యాక్టరీని ముసిందే బిజెపి ఆంధ్ర ప్రాంత ఎంపి అని ఆమె ఆరోపించారు. ఢిల్లీ నాయకులతో ఈ రోజు మోడీ వస్తున్నారు.. మీలా నలుగురి కుటుంబం కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ కుటుంబం మాది అని కవిత పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News