Sunday, December 22, 2024

రేవంత్‌రెడ్డి, ఈటెల రాజేందర్‌పై ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: పులిని చూసి నక్క వాతలు పెట్టుకన్నట్లుగా రేవంత్ రెడ్డి, ఈటల తీరు ఉందని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. గోసంగి సామాజికవర్గం ఆత్మీయ సమ్మేళనానికి కవిత హాజరయ్యారు. కర్నాటక కాంగ్రెస్ పాలనా తీరును చూసి అక్కడి ప్రజలు దుమ్మెత్తి పోస్తున్నారని తెలిపారు. కామారెడ్డిలో నిన్న కర్నాటక సిఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలకు కవిత కౌంటర్ ఇచ్చారు. ఉమ్మడి నిజామాబాద్ లో బిసిలకు ఇవ్వాల్సిన సీట్లను కోట్ల రూపాయాలకు అమ్ముకుని, మొత్తానికి మొత్తం అగ్రవర్ణాలకు కట్టబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ఆమె ఆరోపించారు. బిసిలకు సీట్లు ఇవ్వాకుండా ఇక్కడికి వచ్చి బిసి డిక్లరేషన్ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ అండగా ఉండి కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని ఆమె గోసంగి సామాజికవర్గాన్ని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News