Sunday, December 22, 2024

వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు తందానా: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత షర్మిలపై ఎంఎల్‌సి కవిత తన ట్విట్టర్‌లో సెటైర్ వేశారు. తాము వదిలిన బాణం తానా అంటే తామర పువ్వులు తందానా అంటున్నాయని మండిపడ్డారు. పంజాగుట్టలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం ‘ప్రగతి భవన్’ ముట్టడికి పిలుపునిచ్చిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిలను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. వరంగల్‌లో సోమవారం ఆమె నిర్వహించిన పాదయాత్రలో జరిగిన ఘటనలకు నిరసనగా ఆమె ఈ ‘ఘెరావ్’కు పిలుపునిచ్చారు. కారులో ఆమె వెళ్తుండగా పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. షర్మిల డ్రైవింగ్ సీట్లో ఉండగానే కారును పోలీసులు క్రేన్‌తో లిఫ్ట్ చేసి తరలించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News