Monday, December 23, 2024

బంజారాహిల్స్‌లోని ఓటు వేసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్‌ కేంద్రంలో ఆమె ఓటు  వేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. పట్టణంలోని ఓటర్లంతా బయటకు వచ్చి ఓటు వేయాలని ఆమె కోరారు.

కాగా, ఎన్నికల అధికారులు ప్రజలు ఓటు వేసేందుకు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News