Wednesday, January 22, 2025

ఆసుపత్రి నుంచి కవిత డిశ్చార్జ్

- Advertisement -
- Advertisement -

అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స అనంతరం కవితను  పోలీసులు తిహార్ జైలుకు తరలించారు. జ్వరం, ఇతర సమస్యలతో నిన్న ఆమె అస్వస్థతకు గురికావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. కవితకు వైద్యులు పరీక్షలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉండటంతో తిరిగి జైలుకు తరలించారు.

కాగా, ఢిల్లీ లిక్కర్ కసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత నాలుగు నెలలుగా తీహార్ జైలులోనే ఉంటున్నారు. లిక్కర్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మొదట ఆమెను ఇడి అరెస్టు చేసి జైలుకు తరలించగా.. తర్వాత సీబిఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం అమెపై ఇడి, సిబిఐ కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ రెండు కేసుల్లో కవిత పలుమార్లు బెయిల్ కోరగా.. కోర్టు తిరస్కరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News