Saturday, December 21, 2024

నా హక్కులు హరించొద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ పై తీర్పు వచ్చిన తర్వాతే ఇడి విచారణకు హాజరవుతానని బిఆర్‌ఎస్ ఎం ఎల్‌సి కవిత అన్నారు. గురువారం ఇడి విచారణకు ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం దర్యాప్తు చేయాల్సిందిగా ఇడి అధికారులకు లేఖను పంపారు. ఈ మేరకు కవిత తరఫు ఇడికి స మాచారం అందించారు. అయితే అ సలు గురువారం ఇడి ఎదుట ఎంఎల్‌సి కవిత దర్యాప్తులో భాగంగా హాజరుకావాల్సి ఉంది. ఈనెల 11న దా దాపు 9 గంటల పాటు ఇడి అధికారులు కవితను విచారించిన విషయం తెలిసిందే. ఈనెల 16న మరోసారి వి చారణకు హాజరు కావాలని, అదే రో జున నోటీసులు జారీ చేశారు. అయి తే తాను హాజరుకాలేనని ఈ మెయిల్ ద్వారా ఇడికి కవిత లేఖ పంపారు. మరో రోజున విచారణకు హాజరు అయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. విచారణకు హాజరుకాలేనని ఇడికి కవిత సమాచారం అందించగా ఇడి అడిగిన పత్రాలను న్యాయవాది ద్వారా ఆమె పంపించారు.

ఇదే సందర్భంలో ఇడికి మరో లేఖ రాస్తూ ఆడియో, వీడియో విచారణకు తాను సిద్ధమని స్పష్టం చేశా రు. అధికారులు తన నివాసానికి వచ్చి విచారణ చేయవచ్చని కోరారు. తన ప్రతినిధిగా తన న్యాయవాది భరత్‌ను ఇడికి పంపుతున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే మరో తేదీని ఖరారు చేస్తూ కవితకు ఇడి నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ ఎంఎల్‌సి కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. మరోసారి విచారణకు హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ వేశా రు. ఈ కేసును ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించి అత్యవసర విచారణ చేపట్టాలని కోరినా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరించారు. తదుపరి విచారణను ఈ నెల 24వ తేదీ వరకు వాయిదా వేశారు.
20న విచారణకు రండి.. కవితకు ఇడి నోటీసులు
మరోసారి బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నోటీసులు జారీ చేసింది . ఈనెల 20వ తేదీన వ్యక్తి గతంగా విచారణకు హాజరుకావాలని ఎంఎల్‌సి కవితకు స్పష్టం చేసింది.
నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఇడి.. అందుకే విచారణకు వెళ్లలేదు: అడ్వకేట్ భరత్ వెల్లడి
కవిత దాఖలు చేసిన పిటిషన్ పై ఈ నెల 24న సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు తాము నడుచుకుంటామని బిఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి, కవిత తరపు అడ్వకేట్ సో మా భరత్ చెప్పారు. గురువారం ఢిల్లీలోని ఇడి కార్యాలయం వద్ద సోమా భరత్ మీడియాతో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌పై కేంద్రం కక్షగట్టింది. తప్పుడు కేసులతో కవితను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అనేక కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు’ అని ఆరోపించారు. ఇది తప్పుడు కేసు అని, ఇటు చట్టబద్ధంగా, అటు రాజకీయ క్షేత్రంలో ఎదుర్కొంటామని చెప్పారు. సుప్రీం ఆదేశాలను, చట్టాన్ని ఇడి అధికారులు ధిక్కరించారని సోమా భరత్ ఆరోపించారు. ‘మహిళలను ఇంటి దగ్గర మాత్రమే విచారించాలి. అది కూ డా సాయంత్రం 6 గంటల్లోపే విచారణ పూర్తిచేయాలి.

కానీ విచారణ సందర్భంగా నిబంధనలను అధికారులు ఉల్లంఘించారు. ఈనెల 11న రాత్రి 8 గంటల వరకు విచారించారు’ అని చెప్పారు. సెల్ ఫోన్ ను కూడా చట్టానికి వ్యతిరేకంగా స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇడి విచారణకు కవిత హాజరవ్వాలా? వద్దా? అనే దానిపై సుప్రీం ఆదేశాల ప్రకారమే నడుచుకుంటామని తెలిపారు. ‘చట్ట ప్రకారం ఇంటి దగ్గరే విచారణ జరగాలని గతంలోనే కవిత కోరారు. ఇప్పుడు కూడా చట్టపరంగా విచారణ జరగాలని కోరుకున్నారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాం. ఈ పిటిషన్ పై ఈనెల 24న విచారణ జరుగుతుంది” అని వివరించారు. ‘ఇడి విచారణకు కవిత హాజరు కాకపోవడానికి అనారోగ్యం కారణం కాదు. ఆడవాళ్లను ఇంటి దగ్గరే విచారించాలి. ఇది వారి హక్కు. ఆ హక్కు సాధించుకోవడం కోసం సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. కోర్టు ఏం చెప్తే అది చేస్తాం’ అని స్పష్టం చేశారు. బిఆర్‌ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడానికే ఇడి దర్యాప్తు పేరుతో వేధిస్తోందని ఆరోపించారు.

కవిత తరపున ఇడి కోరిన పలు డాక్యుమెంట్లను సమర్పించినట్లు చెప్పారు. కవితను ఇబ్బంది పెట్టడానికే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మనీలాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50లో నిబంధనలకు విరుద్ధంగా విచారణ చేయడాన్ని ప్రశ్నించినట్లు అడ్వకేట్ తెలిపారు. ఇడి కే సుల్లో నిందితులుగా, సాక్ష్యులుగా విచారించడానికి ఉన్న వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించి ప్రస్తుతం విచారణ జరిపారన్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశామని, 24న ఆ కేసు విచారణకు రానుండటంతో ఇడికి వినతి పత్రం ఇచ్చినట్లు చెప్పారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గత వారం అడిగిన 12సెట్ల పత్రాలను అధికారులకు సమర్పించినట్లు చెప్పారు.
ఉత్కంఠ వాతావరణం…
రెండోసారి ఇడి విచారణకు హాజరయ్యే విషయంలో గు రువారం ఉదయం నుంచి ఢిల్లీలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి మంత్రులు కెటిఆర్, హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్‌లతో పాటు ఎంపిలతో కలిసి కార్యాచరణపై చర్చించారు. అనంతరం న్యాయ నిపుణులతో చర్చించిన కవిత విచారణకు హాజరు కాలేకపోవడానికి వివరణ ఇచ్చారు. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కవిత లేఖతో న్యాయవాదుల బృందం ఇడి కార్యాలయానికి చేరుకుంది. అడ్వకేట్ సోమా భరత్ నేతృత్వంలోని న్యాయ నిపుణుల బృందం 11:40కు ఈడి అధికారులను కలిశారు. ఆ తర్వాత ఢిల్లీ పోలీస్ ఎస్కార్ట్ వాహనం కెసిఆర్ నివాసం నుంచి బయటకు వెళ్లి పోయింది.
మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇడి నోటీసులు
వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను ఈడీ అరెస్టు చేసింది. ఆయన తీహాడ్ జైల్ లో ఉన్నారు
అరుణ్ పిళ్లైకి కస్టడీ పొడిగింపు
అరుణ్ రామచంద్రపిళ్లైకి మూడు రోజుల పాటు కస్టడీని కోర్టు పొడిగింది. కస్టడీని పొడిగించాలని ఇడి కోరడంతో కోర్టు అంగీకరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను అరుణ్ రామచంద్రపిళ్లైను కలిపి విచారించాల్సి న అవసరం ఉందని ఇడి అధికారులు కోర్టుకు తెలిపా రు. అందరిని కలిపి విచారిస్తే ఎలా అని కోర్టు ప్రశ్నించింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవితను అనుమానుతురాలిగా ఇడి అధికారులు కోర్టుకు తెలిపారు. గురువారం విచారణకు కవిత హజరు కాలేదని ఇడి అధికారులు కో ర్టు దృష్టికి తీసుకు వచ్చారు. కవితతో కలిపి విచారణ చేయాల్సి ఉన్నందన అరుణ్ రామచంద్ర పిళ్లై కస్టడీని పెంచాలని కోర్టును కోరారు. కోర్టు సానుకూలంగా స్పందించింది.
24న కాదు నేడే నా పిటిషన్ విచారించండి
ఎంఎల్‌సి కవిత మరోసారి శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నారు. ఈ నెల 20 విచారణకు రావాలని ఇడి నోటీసులు ఇవ్వడంతో తన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని సుప్రీంను కోరనున్నారు. ఈ మేరకు సిజెఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేయనున్నారు. ఇడి చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తోందని తనకు ఇచ్చిన నోటీసులు రద్దు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కవిత తన పిటిషన్‌లో పేర్కొననున్నారు. ఇడి విచారణకు సంబంధించి ఇప్పటికే ఎంఎల్‌సి కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 24న విచారణ జరుపుతామని సర్వోన్నత న్యాయస్థానం తెలిపిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News