Wednesday, January 22, 2025

కొడుకును చూసి భావోద్వేగానికి గురైన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను ఆమె కుమారుడు ఆర్యన్, ఇతర కుటుంబ సభ్యులు పరామర్శించారు. కస్టడీలో ఉన్న కవితను ప్రతిరోజు గంటపాటు కలిసేందుకు కుటుంబ సభ్యులకు కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కవితను కుటుంబ సభ్యులు కలిశారు.

కొడుకు ఆర్యన్‌ని చూడగానే కవిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఆర్యన్ కూడా తన తల్లిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడని సమాచారం. కవిత తన లాయర్ మోహిత్ రావుతో కూడా సమావేశమయ్యారు. తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని భావించి కోర్టుపై విశ్వాసం ఉంచుకోవాలని కవితకు రావు చెప్పినట్లు సమాచారం. శనివారం విచారణ చేపట్టిన రౌస్‌ అవెన్యూ కోర్టు ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ మరో మూడు రోజులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News