పండుగ సందర్భంగా ప్రత్యేక వీడియో సందేశం
సెర్ప్, మెప్మా, ఐకెపి కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన సిఎంకు కృతజ్ఞతలు తెలియజేసిన ఎంఎల్‌సి
హైదరాబాద్ : హోలీ పండగను పురస్కరించుకొని టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రత్యేక సందేశాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఈ హోలీ పండుగ రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. సహజ రంగులతో పండుగ జరుపుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిండు చెరువులు మత్తడి దునుకుతూ , పాడి పంటలతో ప్రజలందరూ ఆనందోత్సాహాల మధ్య పండగను జరుపుకునే వాతావరణం మనకు ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఏర్పడిందని కవిత కొనియాడారు.
80,039 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు శాసనసభలో సిఎం ప్రకటించారని ఈ సందర్భంగా కవిత గుర్తు చేశారు. అటెండర్ నుంచి ఆర్‌డివో వరకు స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు సిఎం స్పష్టం చేశారన్నారు. అన్ని పోస్టుల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్ కల్పించనున్నట్లు ప్రకటించారన్నారు. పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు అందిస్తామని ప్రకటించిన సిఎం కెసిఆర్‌కు ఈ సందర్భంగా ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఐకెపి ఉద్యోగులకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల తో సమానంగా జీతాలు ఇస్తామని సిఎం హామీ ఇచ్చారన్నారు. 7,305 ఫీల్డ్ అసిస్టెంట్లకు తిరిగి ఉపాధిని అందించిన సిఎం కెసిఆర్ గొప్ప మనసు చాటుకున్నారని కవిత అన్నారు.
శ్రద్ధ పెట్టి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి పరిపాలనలో భాగస్వామ్యం అవ్వండి.#HappyHoli pic.twitter.com/sh8IGPwMmG
— Kavitha Kalvakuntla (@RaoKavitha) March 17, 2022