Tuesday, January 21, 2025

సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఇడి, సిబిఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ బెయిల్ పిటిషన్‌పై అగస్ట్ 12న విచారణ జరగనుంది. ఆమె దాఖలు చేసిన పిటిషన్ సోమవారానికి లిస్ట్ అయింది. న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వం లోని ధర్మాసనం విచారించనుంది.

కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు, ఢిల్లీ హైకోర్టు ఇదివరకు నిరాకరించాయి. ఢిల్లీ హైకోర్టు జులై 1న ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లో ఇడి అరెస్ట్ చేసింది. ఆ తర్వాత తీహార్ జైల్లో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. ఈ రెండు కేసుల్లో ఆమెకు కింది కోర్టులు బెయిల్‌ను తిరస్కరించాయి. దాదాపు ఐదు నెలలుగా కవిత తీహార్ జైల్లో ఉంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News