హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఎల్‌సి కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్‌పై అసభ్యపదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సిఎం రేవంత్‌పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంఎల్‌ఎ దళితబిడ్డ బాల్కసుమన్‌పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అవలంభించిన విధానాలనే ఇప్పుడు అవలంభిస్తోందని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందని పేర్కొన్నారు. సూర్యుడిపై ఉమ్మేస్తే అది తిరిగి మన మీదే పడుతుందన్న విషయం రేవంత్ మరిచిపోవద్దని కవిత హితువు పలికారు.
మంగళవారం యాదాద్రి భువనగిరిలో సాంఘీక సంక్షేమ హాస్టల్‌ను ఎంఎల్‌సి కవిత సందర్శించారు. ఇటీవల హాస్టల్‌లో ఇద్దరు పదో తరగతి విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.