- Advertisement -
ధాన్యం కొనుగోలుపై వారిది వితండ వైఖరి
ట్విట్టర్‌లో ఎంఎల్‌సి కవిత
మన తెలంగాణ/హైదరాబాద్ : వరి ధాన్యం కొనుగోలు అంశంలో బిజెపి నేతల కామెంట్స్‌పై ఎంఎల్‌సి కవిత నిప్పులు చెరిగారు. ట్విట్టర్ వేదికగా బిజెపి నేతలను ప్రశ్నించారు. వరి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బిజెపి నాయకుల వితండ వైఖరి చూస్తుంటే
వీళ్ళు అసలు తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందన్నారు. ధాన్యం సేకరణలో దేశమంతటికీ ఒకే విధానం ఉండాలని నిన్న కేసీఅర్ రైతుల పక్షాన స్పష్టంగా డిమాండ్ చేశారని గుర్తు చేశారు. ‘పంజాబ్, హరియాణా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదు. కేంద్రం పంజాబ్‌లో వంద శాతం వడ్లు కొను గోలు చేసినట్టే, తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి. ధాన్యం కొనుగోలుపై వన్ నేషన్ వన్ ప్రొక్యూర్‌మెంట్ ఉండాలి.’ అని ఎంఎల్‌సికవిత అన్నారు.
- Advertisement -