రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు
మోడీ ప్రభుత్వంపై ధ్వజమెత్తిన ఎంఎల్‌సి కవిత
హైదరాబాద్ : బిజెపి ప్రభుత్వం విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రముదముందని ఎంఎల్‌సి కవిత ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదన్నారు. ఈ విషయాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని సూచించారు. సోమవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్వర్యంలో టిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన దీక్ష ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఆదివారం ఉదయం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంఎస్‌ఎ బిగాల గణేష్ గుప్తా ఎంపీలు సురేశ్ రెడ్డి, బిబి పాటిల్, పలువురు టిఆర్‌ఎస్ నేతలతో కలిసి ధర్నా ప్రాంగణాన్ని సందర్శించారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ, రైతుల పంట సేకరణపై కేంద్రం ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు. ప్రతి రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కేంద్ర ప్రభుత్వం సేకరించాల్సిందనన్నారు. కానీ కేంద్రం అందుకు విరుద్దంగా….రాష్ట్రానికో నీతి అన్న చందంగా వ్యవహరిస్తోందని ఆమె తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సిఎం కెసిఆర్ అనేక చర్యలు తీసుకున్నారని, ఫలితంగా తెలంగాణ హరిత రాష్ట్రంగా మారిందన్నారు. ఫలితంగా పంట దిగుబడి రెట్టింపు అయిందన్నారు. ధాన్యం సేకరించకపోతే కనీస మద్ధతు ధరకు అర్ధం లేదన్న కవిత, ప్రతి రైతుకు భరోసా ఇవ్వాల్సిన భాద్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఇప్పటికే రైతుల అందోళనతో బిజెపి ప్రభుత్వం నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారన్నారు. అలాగే ధాన్యం సేకరణలో రైతుల సమస్యలను అర్ధం చేసుకోని పరిష్కరించాలని ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. ధాన్యం సేకరణపై రైతుల ఇబ్బందులను పట్టించుకోకపోతే దేశంలో అహారభద్రత ఇబ్బందులకు గురవుతుందన్నారు. ధాన్యం సేకరణపై గత 15 రోజులుగా టిఆర్‌ఎస్ ఎంపీలు ఢిల్లీలో ఆందోళన చేయగా, ఎమ్మెల్యేలు గల్లీల్లో నిరసన తెలియజేశారన్నారు. ఎమ్మెల్సీ జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తెచ్చి…. దేశ రైతాంగాన్ని బలోపేతం చేయాలని టిఆర్‌ఎస్ పార్టీ పదేపదే డిమాండ్ చేస్తోందని ఎంఎల్‌సి కవిత పేర్కొన్నారు. ఢిల్లీలో రేపు జరగబోయే దీక్షలో మండలం నుండి ఎంపీ వరకు అన్ని స్థాయిల్లోని నేతలు పాల్గొంటారని కవిత తెలిపారు.