Wednesday, January 22, 2025

కడిగిన ముత్యంలా బయటపడతా

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎప్పటికైనా న్యాయం, ధర్మం గెలుస్తుందని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల క విత వ్యాఖ్యానించారు.నిజం నిలకడ మీద తెలుస్తుందని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కడిగిన ముత్యంలా అపవాదుల నుంచి బయటపడతానని పే ర్కొన్నారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకున్న అనంతరం, జూబ్లీహిల్స్‌లోని తన నివాసం వద్ద కవిత మీడియాతో మాట్లాడారు. జనం కోసం పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టి గా పని చేస్తానని పునరుద్ఘాటించారు. కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే పోరాటాల్లో పాల్గొంటాన ని, అంతిమంగా అపవాదులన్నింటి నుంచి కడిగిన ము త్యంలా బయటకు వస్తానని కవిత విశ్వాసం వ్యక్తం చే శారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బెయిల్‌పై విడులైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత నగరంలోని నివాసానికి చేరుకున్నారు.

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎంఎల్‌ఎ తన్నీరు హరీశ్‌రావు, భర్త అనిల్,కుమారుడు ఆదిత్యతో పాటు పలువురు ఎంఎల్‌ఎలు, పార్టీ సీనియర్ నేతలతో కలిసి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బయలుదేరిన కవిత, సాయంత్రం 5 గంటల సమయంలో హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కవితకు బిఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. గులాబీ కార్యకర్తలతో ఎయిర్‌పోర్టు ప్రాంగణమంతా సందడిగా మారింది. కవితపై పార్టీ కర్యకర్తలు పూలవర్షం కురిపించారు. బోకేలు ఇచ్చేందుకు కార్యకర్తలు, అభిమానులు పోటీ పడ్డారు. తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. బిఆర్‌ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు. అనంతరం కవిత విమానాశ్రయం నుంచి బంజారాహిల్స్‌లోని తన నివాసానికి వెళ్తున్న సమయంలో బిఆర్‌ఎస్ శ్రేణులు భారీ ర్యాలీగా నిర్వహించారు. ఇంటి వద్ద కవితకు దిష్టి తీసి అభిమానులు ఇంట్లోకి ఆహ్వానం పలికారు. బంధువులు, కుటుంబ సభ్యులు పూల వర్షం కురిపించారు. కవితకు ఆమె నివాసంలో తల్లి శోభ, కెటిఆర్ సతీమణి శైలిమ, ఇతర కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. కవిత ఇంటికి చేరుకోగానే కుటుంబ సభ్యులతో బిఆర్‌ఎస్ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. గురువారం ఎర్రవెల్లిలోని వ్యవసాయక్షేత్రంలో తన తండ్రి, బిఆర్‌ఎస్ పార్టీ అధినేత కెసిఆర్‌తో కవిత సమావేశం కానున్నారు.

ఇంట్లో భావోద్వేగ దృశ్యాలు..
ఎంఎల్‌సి కవిత ఇంట్లోకి వెళ్లిన తర్వాత నేరుగా పూజ గదికి వెళ్లి దేవుళ్లకు దండం పెట్టుకున్నారు. కవితను కలిసిన వెంటనే తల్లి శోభ, ఇతర కుటుంబ సభ్యులు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి కవిత ఆశీర్వాదం తీసుకున్నారు. కూతురిని ఆప్యాయంగా హత్తుకున్నాక తల్లి శోభ కన్నీటి పర్యంతమయ్యారు. తల్లిని పట్టుకుని కవిత కూడా కన్నీరుపెట్టుకోగా, కుటుంబ సభ్యులు ఓదార్చారు. తన సోదరుడు, మాజీ మంత్రి కెటిఆర్‌కు కవిత రాఖీ కట్టారు.
164 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఎంఎల్‌సి కవితను ఇడి ఈ ఏడాది మార్చి 15న హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మార్చి 26న కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అప్పటి నుంచి జ్యుడీషియల్ కస్టడీపై తిహార్ జైలులో ఉన్నారు. మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం ఇడి, సిబిఐ కేసుల్లో కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత బెయిల్ ఉత్తర్వు కాపీలను న్యాయవాదులు తిహార్ జైలు అధికారులకు అందించారు. 164 రోజుల తర్వాత మంగళవారం జైలు నుంచి విడుదల అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News