Saturday, April 19, 2025

బిఆర్‌ఎస్ తో మారిన బంజారాల బతుకులు:ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

బీఆర్‌ఎస్ పార్టీ, కేసీఆర్ కృషితోనే తెలంగాణలో బంజారాల బతుకులు మారాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. అఖిల భారత బంజారాల ఆధ్యాత్మిక గురువు, పౌరాదేవీ పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖర్ మహారాజ్ బుధవారం నాడు ఎమ్మెల్సీ కవిత నివాసానికి విచ్చేశారు. వారికి సంప్రదాయబద్దకంగా ఎమ్మెల్సీ కవిత ఆహ్వానం పలికారు. వారిని సన్మానించి ఆశ్వీర్వాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు సంత్ శ్రీ చంద్రశేఖర్ మహారాజ్ కు ధన్యవాదాలు తెలియజేశారు. వారి ఆశీర్వాదాలు అందుకోవడం సంతోషంగా ఉందని, వారి ఆశీర్వాదాలు తెలంగాణ రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News