Thursday, February 27, 2025

సిఎం రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యమంత్రి: ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

సిఎం రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని విమర్శించారు. ప్రతీ విషయంలో బిజెపితో సిఎం రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తున్నారని, ప్రధాని మోదీని సిఎం కలిసిన తర్వాత బిజెపి, కాంగ్రెస్ మధ్య దోస్తీ బట్టబయలైందని వెల్లడించారు. బిజెపి నాయకులే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దగ్గరుండి కాపాడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము ప్రజల్లో ఎండగట్టగానే బిజెపి నాయకులు తమను విమర్శిస్తున్నారని, దీన్ని బట్టి ఆ రెండు జాతీయ పార్టీలు కలిసి పనిచేస్తున్నట్లు తేటతెల్లమవుతోందని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బిజెపి మధ్య భాగస్వామ్యం ఉందని, అందులో భాగంగానే లేనిపోని విషయాలను తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు బిఆర్‌ఎస్ పార్టీకి అంటగడుతున్నారని మండిపడ్డారు. ‘

లంగాణ భవన్‌లో గురువారం నాడు బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఎంఎల్‌సి కవిత మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ, న్యాయవాది సంజీవ రెడ్డి కోర్టులో వాదిస్తూ అందరి ముందే ఆరు నెలల క్రితమే గుండె పోటుతో మరణించారని, భూపాలపల్లిలో భూతగాదాల వల్లనే హత్య జరిగినట్లు జిల్లా ఎస్‌పి చెప్పారని, దుబాయ్‌లో ఒక వ్యక్తి నిద్రలోనే చనిపోయారని పత్రికల్లోనే వచ్చిందని, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధం లేని ఈ సంఘటనలను బిఆర్‌ఎస్ పార్టీకి ఎందుకు అంటగడుతున్నట్లు..? అని నిలదీశారు. బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇది అని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News