Tuesday, November 5, 2024

సిబిఐ కస్టడీకి కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ ఎమ్మె కవితను సిబిఐ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను విచారించేందుకు ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోరగా, కోర్టు మూడు రోజులు కస్టడీకి ఇచ్చేందుకు అంగీకరించింది. మూడు రోజులు సిబిఐ అధికారులు లిక్కర్ స్కాంలో విచారణ చేయనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు కవిత సిబిఐ కస్టడీలో ఉండనున్నారు. ఢిల్లీలోని లోధిరోడ్, జవహర్‌లాల్ నెహ్రు మార్గ్‌లోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవితను సిబిఐ అధికారులు విచారణ చేస్తున్నారు. తొలిరోజు ఇంటరాగేషన్‌లో కవిత, బుచ్చిబాబు మధ్య జరిగిన వాట్సాప్ ఛాటింగ్ ఆధారంగా విచారణ చేశారు.

ఇద్దరి మధ్య జరిగిన ఛాటింగ్‌ను ముందు పెట్టి ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో పాటు అప్రూవర్లుగా మారిన అభిషేక్ బోయినపల్లి, శరత్ చంద్రారెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవ ఇచ్చిన వాంగ్మూలాల ను చూపించి ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ నెల 15వ తేదీ వరకు కవిత సీబీ ఐ కస్టడీలో ఉండనున్నారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కు టుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతించింది. ఆమె తర పు న్యాయవాదులు కూడా ఆమెను కలవొచ్చు. మరోవైపు ఇంటి భోజనం, జపమాల, పుస్తకాలు, బెడ్ ను కోర్టు అనుమతించింది. ఆప్ కు రూ. 100 కోట్లు చెల్లించిన వ్యవహారంలో కవిత కీలక పాత్ర పోషించారని సీబీఐ అభియోగాలు మోపింది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి కవిత రూ. 14 కోట్లు తీసుకున్నారని సీబీఐ తెలిపింది. రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా ఉండదని బెదిరించారని చెప్పింది.

కవితను కలిసిన భర్త…
కోర్టు అనుమతి ఇవ్వడంతో ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్ కుమార్ కవితను శనివారం కలిశారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో ఢిల్లీకి వెళ్లిన అనిల్‌కుమార్ కవితను కలిశారు. ఇద్దరు కలిసి పలు విషయాలు చర్చించినట్లు తెలిసింది. విచారణ తర్వాత కవితను సిబిఐ అధికారులు ఈ నెల 15వ తేదీ ఉదయం 10గంటలకు కోర్టులో హాజరుపర్చనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News