Wednesday, January 22, 2025

కవితకు మరో 9 రోజులు జ్యుడిషియల్ కస్టడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంఎల్‌సి కవితకు 23 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ ఇవ్వాలని సిబిఐ కోరింది. తొమ్మిది రోజుల కస్టడీకి ట్రయల్ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత కస్టడీ ముగియడంతో ఇవాళ కోర్టులో ఆమెను సిబిఐ హాజరు పరిచింది. దీంతో విచారణ అధికారుల తీరుపై కవిత ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది సిబిఐ కస్టడీ కాదని, బిజెపి కస్టడీ అని ఎంఎల్‌సి కవిత మండిపడ్డారు. బయట బిజెపి వాళ్లు మాట్లాడిందే లోపల సిబిఐ వాళ్లు అడుగుతున్నారని, రెండేళ్ల నుంచి అడిగిందే అడుగుతున్నారని, కొత్తగా అడిగేది ఏం లేదన్నారు.

లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టు అయిన విషయం తెలిసిందే. పది రోజులు ఇడి కస్టడీలో ఉండగా 14 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నారు. గత మూడు రోజుల నుంచి సిబిఐ అధికారులు కవితను విచారిస్తున్న విషయం విధితమే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News