Thursday, December 19, 2024

ఎంఎల్‌సి కవితకు అస్వస్థత.. ఢిల్లీ వెళ్లనున్న కెటిఆర్, హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఢిల్లీ మద్యం స్కామ్‌లో భాగంగా తిహార్ జైల్లో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత మరోసారి అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. కవిత వైరల్ ఫీవర్‌తో పాటు గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆమె వైద్య పరీక్షలు నిర్వహించారు. గత జులైలో ఆమెకు జ్వరం, గొంతునొప్పి రావడంతో జైలు నుంచి దీనదయార్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెప్పడంతో మళ్లీ జైలుకు తరలించారు. ఆమె మరోసారి అస్వస్థతకు గురికావడంతో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్ రావు గురువారం ఢిల్లీ వెళ్లనున్నట్టు సమాచారం. ఢిల్లీ మద్యం స్కామ్‌లో విచారణను అగస్టు 28కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. గతంలో కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వర్చువల్‌గా విచారించిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News