Sunday, December 22, 2024

ఎంఎల్‌సి కవిత, కేజ్రీవాల్ జ్యూడిషియల్ కస్టడీ పొడిగింపు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించిన ఇడి కేసులో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం మరో వారం రోజులు పొడిగించింది. మరోవైపు ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని రెండు వారాలు పొడిగించారు. మే 20 వరకు కేజ్రీవాల్ కస్టడీ పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఇడి కేసులో ట్రయల్ కోర్టు విధించిన జ్యుడీషి యల్ కస్టడీ మంగళ వారంతో ముగియడంతో కవిత అభ్యర్థన మేరకు ఆమెను నేరుగా కోర్టు ముందు హాజరుపరిచారు.

అయితే, మరో సారి కస్టడీని పొడిగిం చాలన్న దర్యాప్తు సంస్థల విజ్ఞప్తి మేరకు న్యాయస్థానం, కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 14వ తేదీ వరకు పొడిగించింది. దీంతో అప్పటివరకు ఆమె తీహార్ జైలులోనే ఉండనున్నారు. కాగా, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న తనను కోర్టు విచారణ సమయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా ప్రత్యక్షం గా ప్రవేశపెట్టేలా దర్యాప్తు సంస్థలను ఆదేశించాలని కోరుతూ కవిత చేసిన విజ్ఞప్తిని న్యాయమూర్తి కావేరి బవేజా పరిగణనలోకి తీసుకున్నారు. ఇక మీదట కోర్టు విచారణ సమయంలో అవసరమైనప్పుడు కవితను నేరుగా హాజరుపరచాలని దర్యాప్తు సంస్థల అధికారులను ఆదేశించారు. ఇడి, సిబిఐ కేసుల్లో కవిత జ్యుడిషియల్ రిమాండ్ మంగళవారంతో ముగుస్తుండడంతో ఆమెను ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిబ్బంది మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు రౌజ్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు.

ఈ కేసులో కవిత కీలక పాత్రధారి కాబట్టి బెయిల్ ఇవ్వొద్దని, దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో ఆమె బయటికొస్తే సాక్షులు, సాక్ష్యాలను ప్రభావితం చేసే వీలుందని ఇడి, సిబిఐ తరఫు న్యాయవాదులు కోర్టులో వాదనలు వినిపించారు. మరోవైపు, మహిళగా, బిఆర్‌ఎస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న ఆమెకు బెయిల్ మంజూరు చేయాలని కవిత న్యాయ వాదులు కోరారు. ఆమె ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకోవాలని అప్పీల్ చేశారు. అయితే, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం మరో వారం రోజులు కస్టడీని పొడిగించింది. ఇక లిక్కర్ కేసులో ఇడి దూకుడు ప్రదర్శిస్తోంది. లిక్కర్ కేసులో కవిత పాత్రపై వారం రోజుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు ఇడి కోర్టుకు వెల్లడించింది.

ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించారంటూ కవిత ఆగ్రహం
కోర్టు ముందు హాజరైన తర్వాత బయటికి వస్తూ ఎంఎల్‌సి కవిత మీడియాతో మాట్లాడారు. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన జెడిఎఫ్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వారిని దేశం దాటించి, తనలాంటి వారిని అరెస్ట్ చేశారంటూ కేంద్రంలోని బిజెపిపై మండిపడ్డారు. దేశ ప్రజలంతా ఈ విషయాలను గమనించాలన్నారు.

కాగా, దేశంలో సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కవితను ఇడి మార్చి 15న, సిబిఐ ఏప్రిల్ 11న అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఢిల్లీ లిక్కర్ పాలసీని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి వీలుగా ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలకు కవిత రూ.100 కోట్ల ముడుపులు చెల్లించారన్నది దర్యాప్తు సంస్థల ప్రధాన ఆరోపణగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News