Sunday, December 22, 2024

లండన్ బతుకమ్మ పోస్టర్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC Kavitha launches Bathukamma poster

హైదరాబాద్: లండన్ బతుకమ్మ దసరా సంబరాల పోస్టర్‌ను బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఎమ్మెల్సీ కవిత మంగళవారం ఆవిష్కరించారు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ ఆధ్వర్యంలో అక్టోబర్ 1న చేనేత బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావాలని టాక్ ప్రతినిధులు ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఫిల్మ్ డెవలప్‌మెంట్ చైర్మన్లు అనిల్ కుర్మాచలం, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, ఎన్నారై టిఆర్‌ఎస్ నాయకులు వల్లాల శ్రీనివాస్ యాదవ్, టాక్ నాయకులు రాకేశ్ పటేల్, శుషమునా రెడ్డి, మల్లారెడ్డి, ప్రవీణ్, వంశీ,పొన్నం కౌశిక్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News