సిబిఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత షాకిచ్చారు. తాను ఫిబ్రవరి 26న విచారణకు రాలేనని తేల్చి చెప్పారు. 41సీఆర్పీ నోటీసులు రద్దు చేసుకోండి.. లేద ఉపసంహరించుకోండని సిబిఐకి కవిత తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో సోమవారం విచారణకు హాజరుకావాలని ఇటీవల సిబిఐ.. కవితకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో తాను విచారణకు రాలేనని చెబుతూ సిబిఐకి ఆమె లేఖ రాశారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నందున తాను విచారణకు హాజరుకాలేనని స్పష్టం చేశారు. ఎమైనా సమాచారం కావాలంటే వర్చువల్ గా అందుబాటులో ఉంటానని లేఖలో తెలిపారు. అయినా, సిబిఐ అరోపణలో తన పాత్ర లేదని.. ఎన్నికలకు ముందు నోటీసులు ఇవ్వడంపై అనుమానాలు ఉన్నాయని కవిత ఆరోపించారు.
కాగా, ఈడీ కూడా కవితకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు సార్లు విచారించిన అనంతరం.. ఈడీ అధికారుల విచారణ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కవిత..సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం కవిత పిటిషన్ సుప్రీంలో పెండింగ్ లో ఉంది.