Tuesday, November 5, 2024

రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, మంచినీటి సరఫరాపై తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత సహా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, నేతలు హైదరాబాద్‌లో నిరసన తెలిపారు. పొలాలకు సరిపడా విద్యుత్‌ అందుబాటులో ఉన్నప్పుడే రైతులు సంతోషంగా జీవించగలరని కవిత అన్నారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా కవిత బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నగరంలోని పవర్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై తమ వ్యతిరేకతను చాటుకున్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ… తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న రైతుబంధు పథకం దేశంలోనే విశిష్టమైనదని ఆమె పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి కాంగ్రెస్ పార్టీ చేసిన రైతు ప్రకటన బూటకమని ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘60 ఏళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తమ హయాంలో రైతులను ఇబ్బందులకు గురి చేసిందని.. రైతులకు 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వలేకపోతున్నారని.. అలా మాట్లాడే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా? అని ఆమె డిమండ్ చేశారు. రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్‌ నేతలను గ్రామాల్లో తిరగనివ్వబోమని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News