Friday, December 20, 2024

ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ తో ఎంఎల్‌సి కవిత భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎల్‌సి కవిత బుధవారం ప్రగతిభవన్‌కు వెళ్లారు. హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లిన కవిత మరోసారి ముఖ్యమంత్రి కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టయిన సమీర్ మహేంద్రు కేసులో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఇడి ఎంఎల్‌సి కవిత పేరును ప్రస్తావించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే సిఎం కెసిఆర్‌తో కవిత భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో గతంలో నోటీసులు అందుకున్న సమయంలోనూ కవిత సిఎం కెసిఆర్‌తో భేటీ అయిన విషయం విదితమే. అయితే ఇడి, సిబిఐ కేసులు డైలీ సీరియల్‌లాంటివని తన నివాసం నుంచి ప్రగతిభవన్‌కు బయల్దేరే సమయంలో కవిత వ్యాఖ్యానించారు. గురువారం నిజామాబాద్‌లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న కవిత తాజా పరిణామాలపై అక్కడే స్పందిస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News