Monday, January 20, 2025

సిఎం కెసిఆర్‌ తో కవిత భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఎంఎల్‌సి కవిత శనివారం రాత్రి ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్‌తో భేటీ అయ్యారు. ఆదివారం సిబిఐ అధికారులు ఉదయం 11 గంటలకు కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్న నేపథ్యంలో ఈ సమావేశం ప్రా ధాన్యత సంతరించుకుంది. సిఎం కెసిఆర్ తో ఈ విషయమై ఎంఎల్‌సి కవిత చర్చించినట్టుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత ప్రమేయం ఉందని సీబిఐ ఆరోపించడంతో పాటు ఈ మేరకు నోటీసులు సైతం జారీ చేసింది. 6వ తేదీన విచారణకు రావాలని సిబిఐ ఆదేశించింది. అయితే దీనిపై స్పందించిన కవిత సిబిఐకు లేఖ రాశారు.

ఈ నెల 11, 12, 14, 15వ తేదీల్లో తన ఇంటిలో అందుబాటులో ఉంటానని ఆమె ఆ లేఖలో వెల్లడించారు. దీనిపై స్పందించి న సిబిఐ ఈ నెల 11న విచారణ జరిపేందుకు అంగీకరించింది. నేడు ఉదయం 11 గంటలకు వాంగ్మూలం నమోదు చేస్తామని సీబిఐ అధికారులు రిప్లై ఇచ్చారు. ఈనేపథ్యంలోనే సీబిఐ అధికారులు బంజారాహిల్స్ రోడ్ నం 14లోని ఆమె నివాసంలోనే కవిత స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు.
మరోవైపు కవిత నివాసం వద్ద భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. రోడ్డుకు ఇరువైపుల హోర్డింగ్స్, బ్యానర్లను బిఆర్‌ఎస్ శ్రేణులు ఏర్పాటు చేశారు. కవితను ఉద్దేశిస్తూ ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్’ అని రాశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News