Wednesday, December 25, 2024

కెసిఆర్‌ను కలిసిన కవిత

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్‌పై విడుదలైన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత గురువారం తన తండ్రి, బిఆర్‌ఎస్ అధినేత, మాజీ సిఎం కెసిఆర్‌ను ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో కలిశారు. తన భర్త అనిల్, కుమారుడు ఆదిత్యతో ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లిన కవితకు, ఎర్రవల్లి గ్రామస్థులు మంగళహారతి పట్టి ఘనస్వాగతం పలికారు. అనంతరం కవిత తన తండ్రి కెసిఆర్ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఐదు నెలల తర్వాత కుమార్తెను చూసి కెసిఆర్ భావోద్వేగానికి గురయ్యారు. బిడ్డను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.

కవితను చూసి కెసిఆర్ ఆనందంతో ఉప్పొంగారు. కెసిఆర్ నివాసానికి కవిత వెళ్లడంతో అక్కడ సంతోషాలు వెల్లివిసిసాయి. తమ అధినేత సంతోషంలో భాగస్వామ్యులైన సిబ్బంది, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కవిత రాక ఎర్రవెల్లిలోని కెసిఆర్ నివాసం కోలాహలంగా మారింది. తన తండ్రి కెసిఆర్‌ను ఆలింగనం చేసుకున్న ఫోటోను కవిత తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసారు. కవిత వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్‌ఎ పాడి కౌశిక్‌రెడ్డి, పార్టీ నేతలు జీవన్‌రెడ్డి, ఇతర నేతలు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News