Thursday, January 23, 2025

మంత్రి కొప్పుల, ఎంఎల్‌ఎలతో ఎంఎల్‌సి కవిత భేటీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆయా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన అంశాలపై మంత్రి కొప్పుల ఈశ్వర్,పలువురు ఎంఎల్‌ఎలు,ఎంఎల్‌సిలు, ఇతర పార్టీ నేతలతో బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత సమావేశమయ్యారు. నగరంలోని తన నివాసంలో మంగళవారం ఎంఎల్‌ఎలతో పాటు బిఆర్‌ఎస్ సీనియర్ నేత, ఎంఎల్‌సి మధుసూదనా చారి నేతృత్వంలో విశ్వబ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పెద్దలతో మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. బోధన్ నియోజకవర్గంలోని మండలంలో పలు అభివృద్ధి పనులు, నిధుల మంజూరు వంటి అంశాలపై కవితతో ఎంఎల్‌ఎ షకీల్ చర్చించారు. ముఖ్యంగా రోడ్లు, సాగునీటి కాలువల అభివృద్ధి పై ప్రభుత్వానికి అందించాల్సిన ప్రతిపాదనలపై మంతనాలు జరిపారు.అలాగే మంత్రి కెటిఆర్ నిజామాబాద్ పర్యటన ఏర్పాట్లపై ఎంఎల్‌ఎలు షకీల్, గణేష్‌తో చర్చించారు. సింగరేణి ప్రాంత నియోజకవర్గాల స్థానిక ఎంఎల్‌ఎలతో కవిత కవిత మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు కవితను కలిసి పలు అంశాలు చర్చించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంఎల్‌సి రమణ, ఎంఎల్‌ఎలు విద్యాసాగర్ రావు, డాక్టర్ సంజయ్ కుమార్‌లు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి కృషి
నిజామాబాద్ ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు ప్రభుత్వం నుంచి సాయం కోరుతూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రతినిధులు కవితని కలిసి వినతి పత్రం అందించారు. ఆటో డ్రైవర్ల వినతుల పట్ల కవిత సానుకూలంగా స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News