మెదక్: ఏడుపాయల దేవస్థానంలో అమ్మవారికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత శనివారం పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా కవిత అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. ఆమెతో పాటు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, రాష్ట్ర మహిళ కమిషన్ చైర్ పర్సన్ సునీత రెడ్డి ఉన్నారు. ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ… 100 మంది ఆడపడుచులతో కలిసి అమ్మవారికి బోనాలు సమర్పించామన్నారు. ఏడూ పాయల ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉందని పేర్కొన్నారు. మల్లన్న సాగర్ అభివృద్ధితో ఈ ప్రాంతం కూడా అభివృద్ధి చెందిందన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ ప్రాంత అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించారని కవిత పేర్కొన్నారు. తను కూడా ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం చేస్తానన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సద్దుల బతుకమ్మ, దసరా శుభాకాంక్షలు తెలిపారు.
Offered my prayers and Bonalu at Sri Edupayala Vana Durga Bhavani Devalayam.
May the blessings of Amma vaaru bring in good health, prosperity and good time for all. pic.twitter.com/Y75Pg2xV5O
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 1, 2022