Wednesday, January 22, 2025

ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ‌వారికి బంగారు బోనం స‌మ‌ర్పించారు. ఆదివారం ఉజ్జయిని మహంకాళి బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ క‌విత భారీ ర్యాలీతో త‌ర‌లివ‌చ్చి అమ్మ‌వారిని ద‌ర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కు చెల్లించుకున్నారు.

ఇక, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కూడా మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు. మహంకాళి అమ్మవారిని సిఎం కెసిఆర్ దంపతులు దర్శించుకుని, పట్టు వస్త్రాలు సమర్పించారు. కాగా, మహంకాళి అమ్మవారి బోనాల పండుగ నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి చేరుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు.

Also Read: ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన సిఎం కెసిఆర్..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News