- Advertisement -
జనగణన ఇంకెప్పుడు చేస్తారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత కేంద్రాన్ని నిలదీశారు. జనగణనను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నదని ఆరోపించారు. జనాభా లెక్కలు లేకుండా ప్రగతి ఎలా సాధ్యమవుతుంది..? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. జనాభా లెక్కల లేమితో వృద్ధికి ఆటంకం అని, జనాభా లెక్కలు లేకుండా దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితి ఎలా తెలుస్తుందని అడిగారు. ప్రగతిశీల విధానాలకు జనాభా లెక్కలు తప్పనిసరి అని పేర్కొన్నారు. జనగణనపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు.
- Advertisement -