Thursday, April 3, 2025

హెచ్‌సియూ భూములు కాపాడిందే బిఆర్‌ఎస్: ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సియూ) భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూములను కాపాడింది బిఆర్‌ఎస్ ప్రభుత్వమేనని శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత తెలిపారు. యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోవద్దనే ఉద్దేశంతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసిందని, ఆ భూముల పరిరక్షణకు కెసిఆర్ ఆదేశాల మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారని వెల్లడించారు. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని, సిఎం రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్లే 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారని ఆరోపించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వం వితండవాదం చేస్తుందన్నారు.

పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలని కోరారు. ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణం పై ఎంత వత్తిడి పెరుగుతుందొ ప్రభుత్వం గుర్తించాలన్నారు. బిఆర్‌ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో ఏమాత్రం వాస్తవం లేదని ఆమె స్పష్టం చేశారు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలని డిమాండ్ చేశారు. మై హోమ్ రామేశ్వరరావు బిజెపికి అనుగుడు కాబట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యం చేయడంలేదని విమర్శించారు. పేదలు, మూగజీవులు ఉంటే బుల్డోజర్లను ప్రయోగిస్తారు కానీ, పెద్దవాళ్లనేమో ముట్టుకోరా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News