తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించడం దురదృష్టకరం అని బిఆర్ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ దుశ్చర్యకు తెలంగాణ తల్లి కన్నీళ్ళు పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమ తల్లిని నేడు కాంగ్రెస్ తల్లిగా మార్చారని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని రహదారిలో ఏర్పాటు చేసి… తెలంగాణ తల్లి అని చెబుతున్న విగ్రహాన్ని చెరసాలలో ఏర్పాటు చేస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నట్లు కవిత ప్రకటించారు. కోట్లాది మంది తెలంగాణ బిడ్డల్లో స్ఫూర్తి నింపింది తెలంగాణ తల్లి రూపురేఖల్ని మార్చడానికి తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. బ
తుకమ్మతో పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణలో తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదని, తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. బతుకమ్మను మాయం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బతుకును ఆగం చేశారు.. బతుకమ్మను మాయం చేశారని పేర్కొన్నారు. ఉద్యమ కారులపై తుపాకీ ఎక్కు పెట్టినందుకు తెలంగాణ తల్లికి నివాళులర్పించే హక్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లికి నివాళులు అర్పించాలంటే గన్‌పార్క్ దగ్గర ముక్కు నేలకు రాయాలని అన్నారు.