తెలంగాణ తల్లి నూతన విగ్రహం
‘అమ్మ’ను తలపిస్త్తున్నదంటున్న
అధికార కాంగ్రెస్ కాంగ్రెస్
తల్లి విగ్రహమంటూ బిఆర్‌ఎస్
విమర్శలు ‘హస్తం’ గుర్తుకు
దగ్గరగా మార్చుకున్నారంటున్న
బిజెపి తెలంగాణతల్లిని
వక్రీకరిస్తే కఠిన చర్యలు :
ఉత్తర్వులు జారీ
కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం :
ఎంఎల్‌సి కవిత మార్పు
తెస్తామని మోసగించి..
తెలంగాణ తల్లినే మార్చేశారు :
బిజెపి నేత డికె అరుణ ఫైర్
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర రాజకీయాలు తెలంగాణతల్లి విగ్రహం చుట్టూ తిరుగుతున్నాయి. తెలంగాణ తల్లి విగ్ర హం కేంద్రంగా అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యు ద్ధం నడుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్‌ఎస్ పార్టీలు పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. సాధారణ మహిళా రూపంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామని సిఎం రేవంత్‌రెడ్డి ప్రకటించగా, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బిఆర్‌ఎస్ ఆగ్రహం వ్యక్తం చే స్తోంది. సచివాలయంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ప్రతిష్టించగా, ప్రభుత్వానికి పోటీగా మే డ్చల్‌లో బిఆర్‌ఎస్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించింది.కెసిఆర్ రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహం రాజరిక పోకడలతో, ఆయన కుమార్తె రూపురేఖలతో ఉం దని రేవంత్ రెడ్డి ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆరోపించేవారు. తాము అధికారంలో కి రాగానే మార్పించేస్తామని చెప్పేవారు. చెప్పిన్నట్లుగానే కొత్త రూ పు రేఖల తో తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయించి సోమవారం (డిసెంబర్ 9) సచివాలయం ఆవరణలో ప్రతిష్టించారు. తెలంగాణ తల్లి విగ్రహం రాచరికపు పోకడలకు దూ రంగా అమ్మ ను తలపించేలా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో, విగ్రహావిష్కరణ సందర్భంగా చెప్పారు.
తెలంగాణతల్లి రూపకల్పనలో సంప్రదా యం, సంస్కృతులను ప రిగణనలోకి తీసుకున్నామన్నారు. కొత్త విగ్రహం సాధారణ తెలంగాణ మ హిళకు ప్రతిరూపంగా చాలా నిరాడంబరంగా ఉం దని,పోరాటాలతో తెలంగాణ ఏర్పడిందని సూచి స్తూ దిగువన నీలిరంగు పీఠం చుట్టూ మూసిన పిడికిలి బొమ్మలున్నాయని అధికార పార్టీ నేత లు చెబుతుండగా, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మా ర్చడం పై బిఆర్‌ఎస్ నాయకులు భగ్గుమన్నారు. ఆ వి గ్రహం తెలంగాణ తల్లి విగ్రహం కాదు.. కాంగ్రెస్ తల్లి విగ్ర హం అంటూ విమర్శించారు.తెలంగాణ తల్లి వి గ్రహాన్ని అధికారికంగా ఆమోది స్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విష యం తెలిసిందే. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. తెలంగాణ తల్లి.. జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక కాబట్టి..చిత్ర రూపాన్ని వక్రీకరించడం, వేరే విధంగా చూపడాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. తెలంగాణ తల్లి చిత్రాన్ని బహిరంగంగా లేదా సోషల్ మీడియాలో మాటలు, చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం, కించపరచడాన్ని నేరంగా పరిగణించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
సచివాలయంలో పెట్టిన కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నాం : ఎంఎల్‌సి కవిత
తెలంగాణ ఆత్మకు ప్రతీక అయిన తెలంగాణ తల్లి రూపాన్ని మార్చి తెలంగాణ వారసత్వాన్ని రూపుమాపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ఆరోపించారు. అలాంటి అస్థిత్వాన్ని, వారసత్వాన్ని, ప్రజల భావోద్వేగాలను కేవలం ఒక జిఒతో మార్చలేరని తేల్చిచెప్పారు. తెలంగాణ తల్లి చేతిలో ఉన్న జొన్నలు, మక్కలు తెలంగాణకు ప్రతీక అని ముఖ్యమంత్రి అంటున్నారని, కానీ అవి ఇతర రాష్ట్రాల్లో పండవా..? అని ప్రశ్నించారు. ఇతర రాష్ట్రాల్లోనూ అవి పండుతున్నప్పుడు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొత్త విగ్రహంలో ఏం ప్రత్యేకత ఉన్నదని అడిగారు. పార్టీ పిలుపు మేరకు మంగళవారం నాడు బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత అనేక మంది కార్యకర్తలు, నాయకులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఎంఎల్‌సి కవిత మాట్లాడుతూ…ప్రపంచంలో మనకు మాత్రమే ప్రత్యేక పండుగ అయిన బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి దూరం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి మాయం చేసి ఆ స్థానంలో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తును పెట్టి ఇదే తెలంగాణ తల్లి అనడం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ చర్యను ప్రతి ఒక్క తెలంగాణవాది ఖండిస్తున్నారని తెలిపారు. తొమ్మిది మంది కవులు, కళాకారులను సన్మానించడమే కాకుండా ఇంటి స్థలం, రూ. కోటి ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం సంతోషమే కానీ అందులో మహిళలకు స్థానం లేదా..? అని ప్రశ్నించారు. కవులు, కళాకారులను గుర్తించడంలో ఆడబిడ్డలు ఎక్కడ..? అని అడిగారు. విమలక్క, పీవోడబ్ల్యూ సంధ్య, మా భూమి సంధ్య, బెల్లి లలిత, మల్లు స్వరాజ్యం, సదాలక్ష్మి మీకు గుర్తుకు లేదా..? అని నిలదీశారు. మహిళలకు ఏమో విగ్రహాలు… పురుషులకేమో వరాలిస్తున్నారని, ఇది చాలా అన్యాయం అని వ్యాఖ్యానించారు.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు కాబట్టి ఇక మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వరా..? అని నిలదీశారు. తెలంగాణ తల్లి రూపం బీద తల్లి రూపమని ముఖ్యమంత్రి అంటున్నారని, అంటే తెలంగాణలో కూలినాలి చేసుకునే బీద ప్రజలు ఎప్పటికీ కూలీలు గానే ఉండాలన్నది ముఖ్యమంత్రి ఉద్ధేశమా..? అని ప్రశ్నించారు. వాళ్లు గొప్ప వాళ్ళు కావాలని అనుకోకూడదా అని అడిగారు. కాగా, అమ్మను చూస్తే ఒక స్ఫూర్తి పొందే విధంగా ఉండాలని, అలా స్ఫూర్తిదాయకంగా మన సంప్రదాయానికి ప్రతీక అయినా బతుకమ్మను చేతిలో పట్టుకుని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కాంగ్రెస్ తల్లిని పెట్టుకోవడం వల్ల ప్రజల మనసులు నొచ్చుకున్నాయని చెప్పారు. తన ప్రసంగంలో ఒక్క సామాన్య మహిళల పేరు కూడా తీయని సీఎంను ఎలా నమ్మాలి..? అని అడిగారు. సచివాలయంలో పెట్టినటువంటి కాంగ్రెస్ తల్లిని తిరస్కరిస్తున్నామని ఎంఎల్‌సి కవిత ప్రకటించారు.
ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు తక్షణమే అమలు చేయాలి : ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆశా వర్కర్లను గౌరవంగా ప్రగతి భవన్ కు పిలిపించి మాట్లాడి వారి వేతనాలను పెంచారని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఆశా వర్కర్ల మీద దాష్టికం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నారని అన్నారు. ఒకపక్క పేద తల్లి విగ్రహాన్ని పెట్టామని చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి… ఆశా వర్కర్ల మీద దాష్టకం చేశారని ధ్వజమెత్తారు.
పసిడి వర్ణం తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం : వేముల
అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ…తెలంగాణ తల్లి దీవెనలతో నా రాష్ట్రం పసిడి తెలంగాణ గా విరాజిల్లాలని కెసిఆర్ జూన్ 22, 2023 నాడు తెలంగాణ అమరవీరుల స్మారక చిహ్నం ప్రారంభోత్సవంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ వేముల ప్రశాంత్‌రెడ్డి ట్వీట్ చేశారు. కెసిఆర్ అధికారికంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎక్కడా అవిష్కరించలేదని అంటున్న రాష్ట్ర ముఖ్యమంత్రి,మంత్రులకు హుస్సేన్ సాగర తీరాన అమరవీరుల స్మారక చిహ్నం ప్రాంగణంలో కొలువుదీరిన పసిడి వర్ణం తెలంగాణ తల్లి విగ్రహమే నిలువెత్తు సాక్ష్యం అని పేర్కొన్నారు.
మార్పు తెస్తామని మోసగించారు…తెలంగాణ తల్లినే మార్చేసారు: డికె అరుణ
తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై బిజెపి పార్టీ విమర్శలు చేసింది. తెలంగాణ తల్లి కొత్త విగ్రహంపై బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ ఎక్స్ వేదికగా వేదికగా స్పందించారు. ఇదేం ఖర్మ మన తెలంగాణ తల్లికి.. అంటూ మండిపడ్డారు. మార్పు తెస్తామని మోసగించారు…తెలంగాణ తల్లినే మార్చేసారు ..అంటూ ట్వీట్ చేశారు. కీర్తి కిరీటంతో కళకళలాడే తెలంగాణ తల్లిని బోసిగా నిలబెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరీటాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రని చీరతో దైవత్వం ఉట్టిపడే తెలంగాణ తల్లికి పచ్చ చీర చుట్టారని మండిపడ్డారు. ఆఖరికి చేతి భంగిమను కూడా “హస్తం” గుర్తుకు దగ్గరగా మార్చుకున్నారని విమర్శించారు. అయితే ఎంఎల్‌సి కోదండరాం, సిపిఐ ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు తెలంగాణ తల్లిని మాతృమూర్తిని ప్రతిబింబిచేలా ఉందని చెప్పారు.