Thursday, January 23, 2025

స్థానిక సంస్థల్లో బిసి రిజర్వేషన్ల పెంపు ఇంకెంత కాలం..?:ఎంఎల్‌సి కవిత

- Advertisement -
- Advertisement -

స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడానికి ఇంకెంత కాలం తాత్సారం చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే కులగణన పూర్తి చేసి రిజర్వేషన్లు పెంచుతామని కామారెడ్డి బిసి డిక్లరేషన్ ద్వారా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఇంకా అమలు చేయకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు గురువారం నాడు ఎంఎల్‌సి కవిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. బిసిలకు ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి 2024 -25 బడ్జెట్‌లో అరకొర కేటాయింపులు చేసి తొలి ఏడాదే కామారెడ్డి డిక్లరేషన్‌ను సిఎం రేవంత్ రెడ్డి ఉల్లంఘించారని విమర్శించారు.

కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల బిసి వర్గాల్లో ఏ మాత్రం విశ్వాసం లేదని, ఈ వైఖరితో రాష్ట్రంలో బిసిలంతా తీరని అన్యాయానికి గురవుతున్నారని పేర్కొన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో ప్రధాన హామీ అయిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించడం అని తెలిపారు. కుల గణన, బిసి కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే బిసిలకు రిజర్వేషన్ల పెంపు అని కామారెడ్డి బిసి డిక్లరేషన్‌లో స్పష్టంగా పేర్కొని ఉందని అన్నారు. ఏడాది గడిచినా కూడా రిజర్వేషన్ల పెంపునకు అతీగతీ లేదని, అశాస్త్రీయంగా బిసి గణన నిర్వహించి, డెడికేటెడ్ కమిషన్ పేరిట కాలయాపన చేయడమే సిఎం ఆలోచనగా కనిపిస్తోందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News