నవీపేట్ ః మండలంలోని పోతంగల్ గ్రామంలో గురువారం శివ పంచాయతన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. విగ్రహ ప్రతిస్ఠాపన, ధ్వజ స్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమం హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతిచే నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్సీ కవిత కుటుంబ సభ్యులకు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.
అనంతరం ఆలయ ట్రస్టు సభ్యులు , గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత దంపతులను ఘనంగా సన్మానించారు. తదనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రవీందర్‌రావు, జడ్పీ చైర్మన్ దాదన్న గారి విఠల్‌రావు, బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆర్. రామ్ కిషన్‌రావు, పార్టీ మండల అధ్యక్షులు నర్సింగ్ రావు, ఎంపిటిసి రాజు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.