ఘట్‌కేసర్: పోచారం మున్సిపాలిటీ పరిధి పోచారం గ్రామపెద్దలు, దాతల సహకారంతో నూతనంగా నిర్మించిన మహంకాళి, పోచమ్మ, ఈదమ్మ అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట్ట, బోనాల పండగ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, స్థానిక కౌన్సిలర్ బద్దం లాస్య జగన్ మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత పాల్గొని గ్రామంలోని బొడ్రాయి నుంచి ఆలయం వరకు మహిళలతో కలిసి బంగారు బోనంతో ఊరేగింపుగా వెళ్ళి అమ్మవార్లకు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా గుడి గోపురంపై, బోనాల ఊ రేగింపులో హెలికాఫ్టర్ ద్వారా పూల వర్షకురింపించడం భక్తులలో, ప్రజలలో ఉత్సాహాన్ని రేకెత్తించింది. అనంతరం ఆలయ నిర్వాహకులతో కలిసి మంత్రి మల్లారెడ్డి, కవితలు ఆలయంలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఏసిపి నరేష్ రెడ్డి పర్యవేక్షణలో పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ సిఐ వి. అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు, నాయకులు, ప్రజలు తరలిరావడంతో పజలు తోపులాటతో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపాలిటీ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, వైస్ చైర్మన్ నానావత్ రెడ్యా నాయక్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ దర్గ దయాకర్ రెడ్డి, కౌన్సిలర్లు మెట్టు బాల్‌రెడ్డి, సుర్వి సుధాలక్ష్మీ, సహకార సంఘం వైస్ చైర్మన్ బద్దం అనంత్ రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు కొంతం అంజిరెడ్డి, బిఆర్‌ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందడి సురేందర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ గొంగళ్ళ బాలేష్, మండల పార్టీ అధ్యక్షుడు నాగులపల్లి రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, నాయకులు చెరుకు బద్రినారాయణ గౌడ్, బోయపల్లి సత్తిరెడ్డి, బండారి శ్రీనివాస్ గౌడ్, అబ్బవతి నర్సింహా, అక్రమ్ ఆలీ, నర్రి కాశయ్య, బోయపల్లి రాజేశ్వర్ రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, శశిధర్ రెడ్డి, గండిపల్లి శేఖర్, సుర్వి శ్రీనివాస్ గౌడ్, ఇతర ప్రాంతాల నాయకులు, భక్తులు, స్థానిక ప్రజలు పెద్ద ఏత్తున పాల్గొన్నారు.