Tuesday, November 5, 2024

మహిళ బిల్లు సాధించడంలో ఎమ్మెల్సీ కవిత కీలక పాత్ర

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: మహిళా జర్వేషన్ బిల్లు సాధించడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర చాలా గొప్పదని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్ యుకె అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడంలో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.

కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీలు హాస్యాస్పదమని, ఏ గ్యారెంటీ వారంటీ లేని పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, 60 సంవత్సరాలు ప్రజలని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ,మరో సారి నమ్మితే రాష్ట్రాన్ని, దేశాన్ని అమ్మే పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలు మూడోసారి బిఆర్‌ఎస్‌ను ఆశీర్వదిస్తారని, రానున్న ఎన్నికల్లో వంద సీట్లతో కెసిఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారని ధీమా వక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News