Sunday, December 22, 2024

హిమాన్షుపై కవిత ప్రసంసల జల్లు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మేనల్లుడి హిమాన్షు ప్రతిభను చూసి అత్త (కల్వకుంట్ల కవిత) ఉప్పొంగిపోయింది. ఆయనపై ప్రసంసల జల్లు కురిపించింది. రెండు రోజుల క్రితం హిమాన్షు పాడిన గోల్డెన్ అవర్ పాటను విని పులకించిపోయింది. నీ పాట చాలా బ్యూటిఫుల్‌గా ఉందంటూ కవిత శనివారం ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చెవులకు ఇంపైన స్వరాన్ని వినిపించావ్ అల్లుడు….. నిన్ను చూసి చాలా గర్వపడుతున్నాను అంటూ వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా హిమాన్షు పాటిన పాటను కూడా కవిత తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు. అల్లుడు హిమాన్షు చేసే మరో మ్యూజిక్ ఆల్బమ్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నట్లుగా ట్విట్టర్‌లో కవిత పేర్కొన్నారు. విద్యార్ధి దశలోనే అనేక రంగాల్లో ప్రతిభను చూపుతున్న హిమాన్షు నుంచి మునుముందు మరిన్ని అద్భుతాలు చూస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News