Thursday, January 23, 2025

ఆలంపూర్ జోగులాంబ ఆలయంలో ఎమ్మెల్సీ కవిత పూజలు (వీడియో)

- Advertisement -
- Advertisement -

అల్లంపూర్: దక్షిణ కాశీ అని పిలవబడే ఐదవ శక్తిపీఠం శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శనివారం బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. ఈ మేరకు శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, ఆలయ కార్యనిర్వాణాధికారి పురేందర్ కుమార్, ఆలయం ముఖ్య అర్చకులు శర్మలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఉభయ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయాల విశిష్టతను వివరించారు.

ఘన స్వాగతం పలికిన అలంపూర్ ఎమ్మెల్యే వి.ఎం అబ్రహం

మహాశివరాత్రి పండుగ సందర్భంగా అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానం దర్శించుకోవడానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు అల్లంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే చల్ల వెంకట్రాంరెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, ఢిల్లీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మంద జగన్నాథం, గిడ్డంగుల శాఖ చైర్మన్ సాయి చందు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన నాయకులు డాక్టర్ వి ఎం అజయ్, ఆయా శాఖల కార్పొరేషన్ చైర్మన్లు వైస్ చైర్మన్లు డైరెక్టర్లు 4 మండలాల అధ్యక్షులు సర్పంచులు ఎంపీటీసీలు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News