Wednesday, January 15, 2025

స్వయంగా ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసిన ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత…

- Advertisement -
- Advertisement -

MLC Kavitha prepared by Ugadi Pachadi

 

మన తెలంగాణ/హైదరాబాద్: ఉగాది పర్వదినం కావడంతో తెలుగు లోగిళ్లన్నీ పచ్చని మామిడి తోరణాలతో, రంగురంగుల పూలతో సరికొత్త శోభను సంతరించుకున్నాయి. ఇంటిల్లిపాదీ కమ్మటి వంటకాలను ఆరగిస్తూ.. ఉగాది పచ్చడి రుచిని ఆస్వాదిస్తూ పండగను జరుపుకుంటున్నారు. ఈ ఉగాది పండగ పూట టిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తమ ఇంట్లో స్వయంగా ఉగాది పచ్చడి తయారుచేశారు.

ఇంట్లోని పూజ గదిలో పూజ అనంతరం తన స్వహస్తాలతో ఉగాది పచ్చడి తయారుచేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. అంతకుముందు, ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు ఎంఎల్‌సి కవిత ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో శుభాలను తీసుకురావాలని… అందరూ బాగుండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఉగాది పండగ పూట సేవించే షడ్రుచుల పచ్చడి లాగే జీవితంలోనూ కష్టనష్టాలు, సుఖ దు:ఖాలు ఉంటాయని, అన్ని పరిస్థితుల్లోనూ దేవుడు మీ వెంట ఉండాలని కోరుకుంటున్నట్లు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి పేర్కొన్నారు.

ఈ ఏడాది తెలుగువారంతా శుభకృత్ నామసంవత్సరం జరుపుకుంటుంటే… తెలంగాణ యువ మిత్రులు ఉద్యోగ నామ సంవత్సరంగా జరుపుకుంటున్నారని కవిత పేర్కొన్నారు. ప్రభుత్వ రంగంలో 80వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాబోతున్నాయని అన్నారు. ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యేవారు టిశాట్ యూట్యూబ్ చానెల్ ద్వారా ప్రసారమయ్యే క్లాసులను ఉపయోగించుకోవాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News