Sunday, December 22, 2024

ఉజ్జయిని అమ్మవారికి బోనం సమర్పించిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -
- Advertisement -

MLC kavitha presented bonam to Goddess Mahankali

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ఆదివారం మహంకాళి అమ్మవారికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మోండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్ కమాన్ నుండి కవిత బంగారు బోనం ఎత్తుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులతో కలిసి మహంకాళి ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదయ్య నగర్ కమాన్ నుండి మహంకాళి అమ్మవారి ఆలయం వరకు వందలాది మంది మహిళలు బోనాలతో వెంట రాగా, పోతురాజుల ఆటలు, కోలాటం బృందాల, గుస్సాడీ, పులివేషధారణ, డప్పు కళాకారుల చప్పుళ్ళతో కవిత వెంట సాగారు. ఈ కార్యక్రమంలో ఎమ్ఎల్ఏ బేతి సుభాష్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత, కార్పొరేటర్ మహేశ్వరి, మాజీ కార్పొరేటర్ లు అత్తిలి అరుణ గౌడ్, నామన శేషుకుమారి, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News