Monday, January 20, 2025

మహిళా బిల్లుపై సోనియా, ప్రియాంక గాంధీలు ఎందుకు మాట్లాడలేదు?

- Advertisement -
- Advertisement -

మహిళా బిల్లు విషయంపై గత 10 ఏళ్లలో సోనియా, ప్రియాంకా గాంధీలు ఎందుకు మాట్లాడలేదని బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. బుధవారం తన నివాసంలో మహిళా బిల్లుపై కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు.  1996లో దేవే గౌడ ప్రభుత్వంలో తొలిసారి మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారని, ఆనాటి నుంచి 2010 వరకు పలుసార్లు ప్రయత్నాలు జరిగాయని, కాంగ్రెస్ ఒక సారి ప్రయత్నం చేసి విఫలమయ్యిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలో 2010లో రాజ్యసభలో మహిళా బిల్లు ఆమోదం పొందిందని చెప్పారు.

2010లో రాజ్యసభలో ఆమోదం పొందిన బిల్లు 2023లోకి వచ్చినా లోక్ సభలో బిల్లు ఎందుకు ఆమోదం పొందలేదని ప్రశ్నించారు. దానిపై ఈ 15 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ఏం చేసిందని అడిగారు. 2010 నుంచి 2014 వరకు అధికారంలోనే ఉన్న కాంగ్రెస్ కు మహిళా బిల్లు గుర్తుకురాలేదని ఆమె విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News