Monday, December 23, 2024

కాంగ్రెస్ అధికారంలోకి రాదని రేవంత్‌కు తెలుసుః కవిత

- Advertisement -
- Advertisement -

కాంగ్రెస్ అధికారంలోకి రాబోదని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కూడా తెలుసు కాబట్టే ఆయన అమలుకు సాధ్యంకానీ హామీలు ఇస్తున్నారని బిఆర్ఎస్ ఎంఎల్ సి కల్వకుంట్ల కవిత విమర్శించారు.  బుధవారం తన నివాసంలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఎన్నికల్లోనూ ఇలాంటి తప్పుడు హామీలే ఇచ్చారని చెప్పారు. గత ఎన్నికల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీని ప్రజలు విశ్వసించలేదని, తాము రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చినా ప్రజలు తమను గెలిపించారని కవిత చెప్పారు.

ఈ ఎన్నికల్లోనూ అదే జరగబోతుందని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు భయం అంటే హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. ఏ రాజకీయ నాయకుడు తీసుకోలేనన్ని రిస్కులు కేసీఆర్ తీసుకున్నారని, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేట, గజ్వేల్ నుంచి కెసిఆర్ గెలుపొందారని, వ్యూహాత్మకంగానే కామారెడ్డి నుంచి కెసిఆర్ బరిలోకి దిగుతున్నారని కవిత పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News