Saturday, January 18, 2025

లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్

- Advertisement -
- Advertisement -

MLC Kavitha Press Meet on Liquor Scam Allegations

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. కక్షపూరితంగా బిజెపి తనపై ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. విపక్షాలపై బట్ట కాల్చి మీద వేయడం బిజెపి పని అని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ఇది ఆరోగ్యకర పరిణామం కాదన్నారు. కెసిఆర్ బిడ్డను కాబట్టి తనను బద్నాం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తనను బద్నాం చేస్తే కెసిఆర్ భయపడతారని వాళ్లు అనుకుంటున్నారని ఆమె తెలిపారు. తాను మానసికంగా కుంగిపోతానని అనుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. బిజెపి నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ ఆరోపణలపై దర్యాప్తునకు సహకరిస్తానని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News