హైదరాబాద్: కేంద్రం పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టింది. గ్యాస్, పెట్రోల్, డిజిల్ ధరలను వెంటనే తగ్గించాలని మంత్రులు మంత్రి మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ శ్రీమతి కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ శ్రేణులు బేగంపేటలోని సివిల్ సప్లై కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయిల్ సబ్సిడీలు ఎత్తివేసి రూ.23 లక్షల కోట్లు కూడబెట్టుకున్నారని విమర్శించారు. డ్వాక్రా మహిళలు, రైతులకు ఒక్క రూపాయి రుణమాఫీ చేయలేదు కానీ.. రూ.11 లక్షల కోట్ల కార్పొరేట్ రుణాలు మాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజా ఉద్యమాలకు మోడీ ప్రభుత్వం లొంగక తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
MLC Kavitha Protest against Fuel price hike
- Advertisement -