Monday, December 23, 2024

16కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వశర్మ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. ఆదివారం తెలంగాణకు వచ్చిన అస్సాం సిఎం టిఆర్ఎస్ పార్టీ, కెసిఆర్ పాలనపై అవినీతి ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో అస్సాం సిఎం వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ.. ”తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను తుడిచి పెట్టేందుకు బిజెపి పార్టీ నాయకులు ఎందుకు ఇంతలా ప్రయత్నిస్తోందో అర్థం కావడంలేదు. 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నాయకులకు తెలంగాణ ప్రజలు బుద్ది చెప్పారు. బిజెపి కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ఎమిదేళ్లు కావస్తోంది.. మీరు సృష్టించిన 16కోట్ల ఉద్యోగాలు ఎక్కడ?. బంగ్లాదేశ్, మెక్సికో, వియత్నాం దేశాలతో పోలీస్తే దేశంలో నిరుద్యోగ రేటు అధికం. దేశంలో కెసిఆర్ పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టింది. మరోసారి తెలంగాణకు వస్తే సరైన హోం వర్క్ చేసుకుని రావాల్సిందిగా హేమంత్ బిస్వశర్మను కోరుతున్నా” అని చురకలు అంటించారు.

MLC Kavitha Reacts on Assam CM’s Comments

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News