Saturday, November 23, 2024

మహిళా రిజర్వేషన్ల కోసం ఉద్యమం ఉధృతం చేస్తా: కవిత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించడంలో భాగంగా ఈ పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లును తీసుకురావాలన్న డిమాండ్‌తో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె సామాజిక మాధ్యమాల్లో ఒక పోస్టర్‌ను విడుదల చేశారు. మహిళలకు సాధికారత కల్పిద్దాం, దేశానికి సాధికారత కల్పిద్దాం. మహిళల రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వండి. మహిళా రిజర్వేషన్ బిల్లు ఎందుకు ప్రాధాన్యం కాకూడదంటూ ఆమె పోస్టర్‌లో పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం వివిధ రూపాల్లో దేశవ్యాప్తంగా కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ఆమె వెల్లడించారు. వచ్చే నెలలో దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, చర్చలు నిర్వహించనున్నట్టు ఆమె పేర్కొన్నారు.
వివిధ రూపాల్లో కార్యక్రమాలు
మహిళా బిల్లుకు మద్ధతు కోసం దేశంలోని ప్రముఖ విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనపరులు, మేధావులకు ఆమె పోస్టు కార్డులు రాయాలని కార్యాచరణను తయారు చేశారు. ఇప్పటికే జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేయడంతో పాటు దాదాపు 18 పార్టీలతో, ఆయా మహిళా, సంఘాలతో భారత్ జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం ఇప్పటికే నిర్వహించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించడంతో ఆందోళనను మరింత తీవ్ర రూపం చేయాలని కవిత నిర్ణయించారు.అందులో భాగంగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను ఆమె చేపట్టనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News